TG EAGLE: ఈగల్ చూస్తోంది తస్మాత్ జాగ్రత్త

డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్న ఈగల్

Update: 2026-01-18 08:30 GMT

మాదక ద్ర­వ్యా­లు వి­ని­యో­గి­స్తు­న్నా.. వి­క్ర­యి­స్తు­న్నా.. చెడు వ్య­స­నా­ల­కు బా­ని­సై­నా.. ‘ఈగ­ల్‌’ ఇట్టే పట్టే­స్తుం­ది. దాని కళ్లు అలాం­టి­వి మరి. అం­తే­నా.. వి­ద్యా సం­స్థ­ల్లో ప్ర­త్యేక క్ల­బ్‌­లు ఏర్పా­టు చేసి.. వాటి ద్వా­రా మాదక ద్ర­వ్యా­ల­ను ని­ర్మూ­లిం­చేం­దు­కు కృషి చే­స్తోం­ది. పలు శాఖల సమ­న్వ­యం­తో ‘డ్ర­గ్స్‌ వద్దు బ్రో’ అన్న ని­నా­దం­తో వి­స్తృత అవ­గా­హన కా­ర్య­క్ర­మా­లు ని­ర్వ­హి­స్తోం­ది. మాదక ద్ర­వ్యాల ని­వా­ర­ణ­కు ప్ర­తి ఒక్క­రూ స్పం­దిం­చా­లి. ఎక్క­డై­నా అవి వి­క్ర­యి­స్తు­న్న­ట్లు తె­లి­స్తే ఈగ­ల్‌ టో­ల్‌ ఫ్రీ నం­బ­రు 1972కు తె­ల­పా­లి.  

డేగ కన్నుతో సంచలనాలు

మత్తు వద­లు­తా­రా.. వది­లిం­చ­మం­టా­రా అన్న రేం­జ్‌­లో తె­లం­గాణ సర్కా­ర్ డ్ర­గ్స్‌­పై ఉక్కు­పా­దం మో­పు­తోం­ది. టీజీ న్యా­బ్ బృం­దా­లు ఊపి­రి­స­ల­ప­ని దా­డు­ల­తో డ్ర­గ్స్‌­పె­డ్ల­ర్స్‌­ను ఉరు­కు­లు పరు­గు­లు పె­ట్టి­స్తోం­ది. ఈ పరి­స్థి­తు­ల్లో కం­ట్లో నలు­సు­లా.. పంటి కింద రా­యి­లా.. ఈగ­ల్‌ టీ­మ్‌ ఆప­రే­ష­న్‌­లో బయ­ట­ప­డ్డ ఓ వి­ష­యం సం­చ­ల­నం సృ­ష్టి­స్తోం­ది. పే­రెం­ట్స్‌­ను, ప్ర­భు­త్వా­న్ని, అధి­కా­రు­ల­ను కల­వ­ర­పె­డు­తోం­ది. ఇటీ­వల దా­డు­ల్లో ఓ సం­చ­లన డ్ర­గ్‌ నె­ట్‌­వ­ర్క్‌­ను చే­ధిం­చిం­ది. హై­ద­రా­బా­ద్‌­లో­ని కా­లే­జీ­లే అడ్డా­గా వి­ద్యా­ర్థు­లే కస్ట­మ­ర్లు­గా డ్ర­గ్స్‌ దందా కొ­న­సా­గు­తు­న్న­ట్లు దర్యా­ప్తు­లో తే­ల­డం ని­వ్వె­ర­పో­యే­లా చే­స్తోం­ది. డ్ర­గ్స్ పట్టు­బ­డే­ది పబ్బు­లు, గబ్బు­ప­ట్టిన ప్ర­దే­శా­ల­ని ఇన్నా­ళ్లూ భా­విం­చాం.. కానీ.. మె­జా­ర్టీ డ్ర­గ్స్‌ పట్టు­బ­డు­తోం­ది.. వా­టి­కి బా­ని­స­ల­వు­తోం­ది స్టూ­డెం­ట్సే అన్న వి­ష­యం­లో ప్ర­కం­ప­న­లు రే­పు­తోం­ది. అది కూడా వా­ళ్లు చదు­వు­తు­న్న కా­లే­జీ­ల్లో­కే డ్ర­గ్స్ వి­చ్చ­ల­వి­డి­గా వస్తు­న్నా­య­ని ఈగ­ల్‌ టీ­మ్‌ దా­డు­ల్లో బయ­ట­ప­డ­డం షా­కి­స్తోం­ది. డ్ర­గ్స్‌­కు సం­బం­ధిం­చిన ఆయా పరి­ణా­మా­లు.. ప్ర­భు­త్వ వర్గా­ల­తో­పా­టు.. పే­రెం­ట్స్‌­లో­నూ ఆం­దో­ళన కలి­గి­స్తు­న్నా­యి.

పంజాబ్‌లా అవ్వకూడదు

యు­ద్ధం, సై­ని­కు­లు అం­టే­నే.. పం­జా­బ్‌ గు­ర్తు­కు వచ్చే­ద­ని.. అలాం­టి పం­జా­బ్‌ ఇవాళ డ్ర­గ్స్‌ మహ­మ్మా­రి వలలో చి­క్కు­కుం­ద­ని రే­వం­త్ గు­ర్తు చే­శా­రు. డ్ర­గ్స్‌ ని­వా­ర­ణ­లో తె­లం­గాణ దే­శా­ని­కే ఆద­ర్శం­గా ని­ల­వా­ల­న్నా­రు. యు­వ­త­ను సరైన మా­ర్గం­లో పె­ట్టా­ల­ని తల్లి­దం­డ్రు­ల­కు సూ­చిం­చా­రు. 140 కో­ట్ల జనా­భా ఉన్న దే­శా­ని­కి ఒలిం­పి­క్స్‌­లో ఒక్క స్వ­ర్ణ­ప­త­కం రా­క­పో­వ­టం గు­రిం­చి ఆలో­చిం­చా­మ­ని,,. యు­వ­త­కు సాం­కే­తిక నై­పు­ణ్యం అం­దిం­చేం­దు­కు యం­గ్‌ ఇం­డి­యా స్కి­ల్స్‌ యూ­ని­వ­ర్సి­టీ ఏర్పా­టు చే­శా­మ­న్నా­రు. EAGLE ఒక డె­డి­కే­టె­డ్ వా­ట్సా­ప్ నం­బ­ర్ (897781972),  టోల్-ఫ్రీ హె­ల్ప్‌­లై­న్ (1972)ను ప్ర­వే­శ­పె­ట్టిం­ది, దీని ద్వా­రా ప్ర­జ­లు మాదక ద్ర­వ్యాల కా­ర్య­క­లా­పాల గు­రిం­చి సమా­చా­రా­న్ని అం­దిం­చ­వ­చ్చు. మాదక ద్ర­వ్యా­ల­పై అవ­గా­హన కల్పిం­చ­డా­ని­కి రా­ష్ట్ర, జి­ల్లా, మండల, మరి­యు గ్రామ స్థా­యి­లో సమా­వే­శా­లు, ప్ర­చార కా­ర్య­క్ర­మా­ల­ను ని­ర్వ­హిం­చ­డా­ని­కి ప్ర­ణా­ళి­క­లు రూ­పొం­దిం­చా­రు.  పా­ఠ­శా­ల­లు, కళా­శా­ల­లు, యూ­ని­వ­ర్సి­టీ­లు,  గ్రామ సచి­వా­ల­యా­ల­లో 10 సభ్యు­ల­తో కూ­డిన ‘EAGLE కమి­టీ­లు’ ఏర్పా­టు చే­స్తా­రు. 

Tags:    

Similar News