సికింద్రాబాద్ నియోజకవర్గంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావుకు చేదు అనుభవం ఎదురైంది.. తార్నాక డివిజన్ మాజీ కార్పొరేటర్ ఆలకుంట హరికి టికెట్ ఇవ్వకపోవడంతో అసంతృప్త సెగలు రగులుతున్నాయి.. ఈ నేపథ్యంలోనే మణికేశ్వర నగర్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి తరఫున ప్రచారానికి వెళ్లిన డిప్యూటీ స్పీకర్‌ను మాజీ కార్పొరేటర్ అనుచరులు అడ్డుకున్నారు. టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ గందరగోళం చోటు చేసుకుంది.. పోలీసులు, ఎస్కార్ట్ సిబ్బంది సాయంతో మణికేశ్వరనగర్ బస్తీ నుంచి బయటపడ్డారు.