Bandi sanjay : గ్రామ సర్పంచ్‌లకు బండి సంజయ్ లేఖ..!
Bandi sanjay : తెలంగాణ సర్పంచ్‌లు ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తే బీజేపీ మద్దతిస్తుందన్నారు బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్.;
Bandi sanjay : తెలంగాణ సర్పంచ్‌లు ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తే బీజేపీ మద్దతిస్తుందన్నారు బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్. గ్రామాలకు రావాల్సిన పెండింగ్ బిల్లులు, హక్కుల పరిరక్షణ కోసం త్వరలోనే మౌనదీక్ష చేస్తామన్నారు. రాజ్యాంగంలోని 73, 74 అధికరణలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందంటూ గ్రామ సర్పంచ్‌లకు బండి సంజయ్ లేఖ రాశారు. పంచాయతీల అభివృద్ధికి కేంద్రం ఇస్తున్న నిధులను టీఆర్‌ఎస్ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందన్న బండి సంజయ్.. సర్పంచ్‌లపై జిల్లా అధికారుల వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. గ్రామాలు స్వశక్తితో అభివృద్ధి పథంలో నడవాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యం అన్నారు.