Bandi Sanjay: గవర్నర్ తమిళసైతో రాష్ట్ర బీజేపీ లీడర్ల భేటీ.. 317 జీవో రద్దుపై..
Bandi Sanjay: గవర్నర్ తమిళసైతో.. బీజేపీ బృందం భేటీ అయింది. 317 జీవోను రద్దు చేయాలంటూ గవర్నర్‌ను కోరింది బీజేపీ బృందం;
Bandi Sanjay: తెలంగాణ గవర్నర్ తమిళసైతో.. బీజేపీ బృందం భేటీ అయింది. 317 జీవోను రద్దు చేయాలంటూ గవర్నర్‌ను కోరింది బీజేపీ బృందం. అనంతరం మాట్లాడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్.. ఉపాధ్యాయ, ఉద్యోగుల ఇబ్బందులను గవర్నర్‌కు వివరించినట్లు తెలిపారు. మరోసారి సకల జనుల సమ్మె జరగాల్సిందేనని స్పష్టం చేశారు. ఉద్యోగుల బదిలీల్లో తీవ్ర అవినీతి చోటు చేసుకుందని ఆరోపణలు ఉన్నాయన్నారు. ఉద్యోగ సంఘాల నేతలకు బీజేపీ వ్యతిరేకం కాదని తేల్చి చెప్పారు. ఉద్యోగులను హింసించిన పాపం కేసీఆర్‌కు తగులుతుందన్నారు.