తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పార్టీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. దాంతో వారంతా ఢిల్లీకి బయలుదేరారు. అధిష్టానం నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పిలుపు రావడంపై చర్చ జరుగుతోంది. పార్టీ అధ్యక్షుడి మార్పుపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అభిప్రాయాలను అధిష్టానం తీసుకుంటుందన్న ప్రచారం జరుగుతోంది. పార్టీ కార్యకలాపాలకు అంటీ ముట్టనట్లు ఉంటూ వస్తున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఢిల్లీ వెళ్లడం ఆసక్తికరంగా మారింది. అతి త్వరలోనే తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడిని ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీకి జోరు తీసుకురావాలని అధిష్టానం ప్రయత్నిస్తోంది.