Etela Rajendar : ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. వచ్చేది బీజేపీ ప్రభుత్వమే : ఈటల

Etela Rajendar : ధాన్యం సేకరణలో తెలంగాణ ప్రభుత్వం ప్రైవేటు ఏజెన్సీలా పనిచేస్తోందని విమర్శించారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌.;

Update: 2022-03-23 12:30 GMT

Etela Rajendar : ధాన్యం సేకరణలో తెలంగాణ ప్రభుత్వం ప్రైవేటు ఏజెన్సీలా పనిచేస్తోందని విమర్శించారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌. సీఎం కేసీఆర్ రైతుల ఉసురు పోసుకుంటున్నారని ఆరోపించారు. ధాన్యం సేకరించబోమని కేంద్రం ఎన్నడూ చెప్పలేదన్నారు. 30లక్షల ఎకరాల్లో ధాన్యాన్నే కొనలేని కేసీఆర్.. కోటి ఎకరాల్లో ధాన్యం పండిస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. గిరిజన రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అంశమని.. ముఖ్యమంత్రే సమాధానం చెప్పాలన్నారు. ఇక.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు ఈటల.

Tags:    

Similar News