Raja Singh : రాజా సింగ్ న్యాయవాదికి బెదిరింపుకాల్స్..
Raja Singh : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తరఫు లాయర్ కరుణ సాగర్‌కు బెదిరింపు కాల్స్ సంచలనం రేపుతున్నాయి.;
Raja Singh : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తరఫు లాయర్ కరుణ సాగర్‌కు బెదిరింపు కాల్స్ సంచలనం రేపుతున్నాయి. రాజాసింగ్‌కు బెయిల్ ఇప్పించినందుకు తనను బెదిరిస్తున్నారని లాయర్ కరుణ సాగర్ అంటున్నారు. పోలీసుల వైఫల్యంతోనే రాజాసింగ్ రిమాండ్ రిజక్ట్ అయ్యిందని... న్యాయవాది వృత్తిని నెరవేర్చామన్నారు. తనకు దుబాయ్ నుంచి గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపు కాల్స్ చేస్తున్నారని అన్నారు. ఇటువంటి బెదిరింపులకు భయపడేది లేదన్నారు. పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.