Bjp Files RTI : బీజేపీ చేతిలో ఆర్టీఐ అస్త్రం
Bjp Files RTI : టీఆర్‌ఎస్‌ను ఎండగట్టడంలో బీజేపీ దూకుడు పెంచింది. ప్రభుత్వ వైఫల్యాలను వెలికితీయడంలో ఆర్‌టీఐను ఆయుధంగా వాడుకుంటోంది.
Bjp Files RTI : టీఆర్‌ఎస్ సర్కారు వైఫల్యాలను ఎండగట్టడంలో... బీజేపీ దూకుడు పెంచింది. 8 ఏళ్ల ప్రభుత్వ వైఫల్యాలను వెలికితీయడంలో భాగంగా ఆర్‌టీఐను ఆయుధంగా వాడుకుంటోంది. సీఎం కేసీఆర్ వివిధ సందర్భాల్లో అసెంబ్లీ, మండలితో పాటు వివిధ జిల్లాల్లో పర్యటించిన సమయంలో ఇచ్చిన హామీలు, వాటి అమలు వివరాలు కోరుతూ.. ఆర్టీఐ దాఖలు చేశారు బండి సంజయ్. సీఎంవోతో పాటు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, ఆర్థిక, రెవెన్యూ, ఏసీబీ, సంక్షేమ, పంచాయతీరాజ్, సాగునీటి, విద్యా, వైద్య శాఖలకు దాదాపు వంద ఆర్టీఐ దరఖాస్తులు దాఖలు చేశారు. గత నెల 28న వీటిని దాఖలు చేశారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్నీ ఆధారాలతో సహా ప్రజాకోర్టులో దోషిగా నిలబెట్టడమే లక్ష్యంగా... ఆర్టీఐ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ ఆర్టీఐ దరఖాస్తులు చేస్తున్నారు బీజేపీ నేతలు. యువ మోర్చాల తోపాటు బీజేపీ నేతలు.. వివిధ అంశాలపై ఆర్‌టిఐ దరఖాస్తులు చేస్తున్నారు. ఆర్టీఐతో ప్రభుత్వంపైన ఒత్తిడి పెంచే వ్యూహరచన చేస్తోంది బీజేపీ. వివిధ మీడియా సంస్థలకు ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనల వివరాలు కోరుతూ... బీజేపీ ఉపాధ్యక్షులు మనోహర్‌రెడ్డి ఆర్టీఐ దరఖాస్తులు చేశారు.