Dalita Bandhu: బీజేపీ డప్పుల మోత.. దళిత బంధు కావాలంటూ..

Dalita Bandhu: దళిత బంధును అమలు చేయాలనే డిమాండ్‌తో బీజేపీ.. హైదరాబాద్‌లో డప్పుల మోత మోగిస్తోంది.;

Update: 2021-11-09 07:43 GMT

Dalita Bandhu (tv5news.in)

Dalita Bandhu: దళిత బంధును అమలు చేయాలనే డిమాండ్‌తో బీజేపీ.. హైదరాబాద్‌లో డప్పుల మోత మోగిస్తోంది. ఎల్బీ స్టేడియం వద్ద గల బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి ప్రారంభమైన ర్యాలీ.. ట్యాంక్‌ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగనుంది. బీజేపి దళితమోర్చా ఆధ్వర్యంలో జరుగుతున్న డప్పుల మోత కార్యాక్రమంలో పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎల్బీ స్టేడియం నుంచి ట్యాంక్‌ బండ్‌ వరకు అడుగడుగునా పోలీసులు మోహరించారు.

హుజూరాబాద్‌ ఎన్నికల తర్వాత తెలంగాణలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. హుజూరాబాద్‌ విజయంతో బీజేపీ ఫుల్‌ జోష్‌లో ఉంది. అదే జోష్‌లో బండి సంజయ్‌ మాటల యుద్ధానికి తెరలేపగా.. సీఎం కేసీఆర్‌ వరుస ప్రెస్‌ మీట్‌లతో ఢీ అంటే ఢీ అంటూ హీట్‌ పెంచారు. కాగా టీఆర్ఎస్ పార్టీపై క్షేత్ర స్థాయిలో పోరులో భాగంగా హుజూరాబాద్ ఎన్నికల సమయంలో కేసీఆర్‌ చేసిన దళిత బంధునే ఆయుధంగా చేసుకుని బీజేపీ నిరసనలకు తెరలేపుతోంది.

Tags:    

Similar News