Minister Sridhar Babu : ధాన్యం సేకరించిన వారంలోపే బోనస్: మంత్రి శ్రీధర్ బాబు
సన్న రకాల ధాన్యం పండించిన రైతులకు 500 బోనస్ కచ్చితంగా ఇస్తామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ధాన్యం సేకరించిన వారంలోపే చెల్లిస్తామన్నారు. సబ్ కమిటీ నివేదిక రాగానే రైతు భరోసా కూడా ఇస్తామని ప్రెస్‌మీట్‌లో తెలిపారు. హరీశ్ రావు, కేటీఆర్ రైతులను రెచ్చగొడుతున్నారని, రైతుల కష్టాలపై మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. రైతులు పండించిన ప్రతి పంటను కొనుగోలు చేస్తామని మంత్రి తుమ్మల తెలిపారు. తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ, బీఆర్‌ఎస్ కుట్రలు చేస్తున్నాయని మంత్రి శ్రీధర్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. సింపతీ కోసమే కేటీఆర్ పదేపదే అరెస్టు అంటున్నారని, ఆయన అరెస్టుకు తాము కుట్ర చేయలేదని తెలిపారు. లగచర్లలో అధికారులపై హత్యాయత్నం జరిగిందని, రైతుల ముసుగులో కొందరు దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. విచారణ పూర్తయ్యాక అన్ని విషయాలు బయటకు వస్తాయని వ్యాఖ్యానించారు.