బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసు.. పోలీసుల అదుపులో సిద్దార్ధ అండ్ టీం
పోలీసుల కస్టడీలో ఉన్న అఖిలప్రియను దర్యాప్తు అధికారులు ప్రశ్నిస్తున్నారు.;
బోయిన్ పల్లి కిడ్నాప్‌కేసులో పోలీసులు మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. గోవాలో సిద్దార్ధ అండ్ టీమ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అఖిలప్రియ భర్త భార్గవ్ రాం, గుంటూరు శ్రీను.. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు.
మరోవైపు పోలీసుల కస్టడీలో ఉన్న అఖిలప్రియను దర్యాప్తు అధికారులు ప్రశ్నిస్తున్నారు. దీనిలో భాగంగా కిడ్నాప్ జరిగిన రోజుకు సంబంధించిన సెల్ టవర్ లొకేషన్, కాల్ డేటా వివరాలను అఖిలప్రియ ముందు ఉంచారు.
ఈ సందర్భంగా దర్యాప్తు అధికారులు అడిగిన కొన్ని ప్రశ్నలకు మాత్రమే అఖిలప్రియ సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. మరికొన్నింటికి సమాధానం గుర్తుకు లేదని దాటవేసినట్లు తెలిసింది.
అయితే కిడ్నాప్ కేసులో జగత్ విఖ్యాత్ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే అతని డ్రైవర్ దుర్గను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో రేపటి అఖిలప్రియ దర్యాప్తు ఎంతో కీలకంగా మారనుంది.