ఇవాళ్టి నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అవగాహన తరగతులను బహిష్కరించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు. తమ హక్కులకు భంగం కలిగేలా స్పీకర్ వ్యవహరించారని కేటీఆర్ తెలిపారు. తొలిరోజే తమను లోపలికి రాకుండా అరెస్టు చేయించారని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలు ఎత్తిచూపితే అరెస్టు చేశారని చెప్పారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అక్రమ పార్టీ ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ నాన్చుడు ధోరణి అవలంబిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.