సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రిక్వెస్ట్ చేశారు. అసెంబ్లీలోని సభాపతి కార్యాలయంలో హరీశ్ రావు, తలసాని, మాధవరం కృష్ణారావు, సబితా ఇంద్రారెడ్డి, సుధీర్ రెడ్డి, వివేకానంద ఆయనను కలిశారు. జగదీశ్ రెడ్డి స స్పెన్షన్ అన్యాయమని అన్నారు. స్పీకర్ ను ఏకవచనంతో పిలవలేదని, సభా సంప్రదాయాలను ఆయన ఉల్లంఘించలేదని తెలిపారు. సస్పెన్షన్ పై ఫ్లోర్ లీడర్ల అభిప్రాయం కానీ, బీఆర్ఎస్ పార్టీ తరపున వివరణ కానీ, జగదీశ్ రెడ్డి వివరణ గానీ తీసుకోకుండానే కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుందని చెప్పారు.