BRS PROTEST: బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్త ఆందోళనలు

కాళేశ్వరంపై సీబీఐ విచారణ నిరసిస్తూ రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపు

Update: 2025-09-02 03:00 GMT

‘కా­ళే­శ్వ­రం’పై కాం­గ్రె­స్ సర్కా­ర్ చే­స్తు­న్న కు­ట్ర­ల­కు ని­ర­స­న­గా నేడు రా­ష్ట్ర­వ్యా­ప్త ఆం­దో­ళ­న­ల­కు బీ­ఆ­ర్ఎ­స్ వర్కిం­గ్ ప్రె­సి­డెం­ట్, మాజీ మం­త్రి కే­టీ­ఆ­ర్ పి­లు­పు­ని­చ్చా­రు. ఈ మే­ర­కు పా­ర్టీ శ్రే­ణు­ల­తో ఇవాళ ఆయన టెలి కా­న్ఫ­రె­న్స్ ని­ర్వ­హిం­చా­రు. మండల, జి­ల్లా కేం­ద్రా­ల్లో నేడు వి­విధ రూ­పా­ల్లో ని­ర­సన తె­ల­పా­ల­ని పా­ర్టీ శ్రే­ణు­ల­కు ది­శా­ని­ర్దే­శం చే­శా­రు. కే­టీ­ఆ­ర్ పి­లు­పు మే­ర­కు ధర్నా­లు, రా­స్తా­రో­కా­లు, బైక్ ర్యా­లీ­లు అంటూ వి­విధ రూ­పా­ల్లో ని­ర­స­న­ల­కు బీ­ఆ­ర్ఎ­స్ శ్రే­ణు­లు సన్న­ద్ధ­మ­య్యా­యి. కాం­గ్రె­స్ పా­ర్టీ కా­లే­శ్వ­రం పైన కు­ట్ర­లు చే­స్తోం­ద­ని ఆరో­పిం­చా­రు. తె­లం­గాణ వర­ప్ర­దా­యి­ని కా­ళే­శ్వ­రం ప్రా­జె­క్టు­ను శా­శ్వ­తం­గా మూ­సే­సి నదీ జలా­ల­ను ఆం­ధ్రా­కు తర­లిం­చేం­దు­కు రే­వం­త్ కు­ట్ర­లు చే­స్తు­న్నా­రు" అని కే­టీ­ఆ­ర్ మం­డి­ప­డ్డా­రు.

బీ­జే­పీ కాం­గ్రె­స్ కలి­సి చే­స్తు­న్న కు­ట్ర­ల­ను సమ­ర్ధం­గా తి­ప్పి కొ­ట్టా­ల­ని అన్నా­రు. ఇది కే­సీ­ఆ­ర్‌­పై చే­స్తు­న్న కు­ట్ర మా­త్ర­మే కాదు.. తె­లం­గాణ నదీ జలా­ల­ను ఒక్క రా­ష్ట్రా­ల­కు తర­లిం­చి, కా­ళే­శ్వ­రా­న్ని ఎం­డ­బె­ట్టే ప్ర­య­త్నం­లో భా­గ­మే­న­ని పే­ర్కొ­న్నా­రు. సీ­బీ­ఐ­కి కా­ళే­శ్వ­రం అప్ప­జె­ప్ప­డం అంటే పూ­ర్తి­గా ప్రా­జె­క్టు­ను మూ­సే­య­డ­మే­న­ని అన్నా­రు. ని­న్న­టి దాకా సీ­బీ­ఐ­కి వ్య­తి­రే­కం­గా మా­ట్లా­డిన రే­వం­త్ రె­డ్డి ఒక్క రో­జు­లో­నే మాట ఎం­దు­కు మార్చాడని ప్రశ్నించారు. రేవంత్ తీరును ప్రశ్నించాలని శ్రే­ణు­ల­కు ది­శా­ని­ర్దే­శం చే­శా­రు.

ప్రభుత్వానికి చేతకాదని తెలుసు: ఈటల రాజేందర్

కా­ళే­శ్వ­రం ప్రా­జె­క్టు వి­చా­ర­ణ­ను సీ­బీ­ఐ­కి అప్ప­గిం­చా­ల­న్న తె­లం­గాణ ప్ర­భు­త్వ ని­ర్ణ­యం­పై రా­జ­కీయ రచ్చ కొ­న­సా­గు­తోం­ది. కా­ళే­శ్వ­రం ప్రా­జె­క్టు పై వి­చా­ర­ణ­ను సీ­బీ­ఐ­కి అప్ప­గిం­చ­డం­పై బీ­జే­పీ నేత, ఎంపీ ఈటల రా­జేం­ద­ర్ స్పం­దిం­చా­రు. ‘మంచి పని చే­శా­రు. వా­ళ్ల­కి చేత కా­ద­ని తె­లు­సు. వా­ళ్ల రి­పో­ర్టు తప్పుల తడక అని తె­లు­సు.. వా­ళ్ల రి­పో­ర్టు ని­ల­వ­దు అనే­ది వా­ళ్ల­కు అర్థ­మైం­ది కా­బ­ట్టి డిస్ ఓన్ చే­సు­కో­వ­డా­ని­కి ఈ పని చే­శా­రు’ అని అన్నా­రు. ఏది ఏమై­న­ప్ప­టి­కీ కా­ళే­శ్వ­రం ప్రా­జె­క్టు అవ­క­త­వ­క­ల­పై సీ­బీఐ సం­పూ­ర్ణం­గా ఎం­క్వ­యి­రీ చే­స్తుం­ద­ని నమ్మ­క­ముం­ద­ని తె­లి­పా­రు. కా­ళే­శ్వ­రం­పై జరి­గిన అక్ర­మా­ల­ను బయ­ట­పె­డు­తుం­ద­ని సం­పూ­ర్ణ వి­శ్వా­సం మాకు ఉం­ద­ని క్లా­రి­టీ ఇచ్చా­రు. సీబీఐ సమగ్ర విచారణతో తప్పు చేసిన వాళ్లు శిక్ష అనుభవించక తప్పదని.. తాము పూర్తిగా సహకరిస్తామని ఈటల తెలిపారు.

Tags:    

Similar News