BRS: బీఆర్ఎస్‌ రోడ్‌ షోలో రప్ప రప్ప పోస్టర్లు

వై­సీ­పీ ఇలాం­టి పో­స్ట­ర్ల­నే ప్ర­ద­ర్శిం­చ­డం­తో ఏపీ­లో దు­మా­రం

Update: 2025-11-08 04:00 GMT

జూ­బ్లి­హి­ల్స్ ఉపఎ­న్నిక దగ్గ­ర­ప­డ­టం­తో కాం­గ్రె­స్, బీ­ఆ­ర్ఎ­స్ పా­ర్టీ­లు ప్ర­చా­రం­లో జోష్ మరింత పెం­చా­యి. అటు సీఎం రే­వం­త్‌­తో పాటు మం­త్రు­లు, ఎమ్మె­ల్యే­లు ప్ర­చా­రం­లో బి­జీ­గా ఉం­డ­గా బీ­ఆ­ర్ఎ­స్ నుం­డి కే­టీ­ఆ­ర్, హరీ­ష్ రావు సహా ఎమ్మె­ల్యే­లు ప్ర­చా­రం­లో పా­ల్గొం­టు­న్నా­రు. అయి­తే ఈక్ర­మం­లో ఆస­క్తి­కర ఘటన చోటు చే­సు­కుం­ది. ఎన్ని­కల ప్ర­చా­రం సం­ద­ర్భం­గా బీ­ఆ­ర్ఎ­స్ రోడ్ షోలో రప్పా రప్పా 2028 పో­స్ట­ర్లు దర్శ­నం ఇచ్చా­యి. పు­ష్ప సి­ని­మా­లో­ని రప్ప రప్ప డై­లా­గ్ పో­స్ట­ర్‌­ను ఓ వ్య­క్తి ప్ర­ద­ర్శిం­చ­గా అం­దు­లో బీ­ఆ­ర్ఎ­స్ నేత జక్కి­డి రఘు­వీ­ర్ రె­డ్డి పేరు ఉంది. అం­తే­కా­కుం­డా కే­సీ­ఆ­ర్ మరి­యు కే­టీ­ఆ­ర్ ఫో­టో­లు ఉన్నా­యి. అయి­తే అప్ప­ట్లో వై­సీ­పీ ఇలాం­టి పో­స్ట­ర్ల­నే ప్ర­ద­ర్శిం­చ­డం­తో ఏపీ­లో దు­మా­రం రే­గిం­ది. సి­ని­మా­లో­ని డై­లా­గు­లో రప్పా రప్పా నరు­కు­తాం.. అని ఉం­టుం­ది. దీం­తో వై­సీ­పీ ఈ డై­లా­గు­ను వా­డ­టం­తో టీ­డీ­పీ వి­మ­ర్శ­లు కు­రి­పిం­చిం­ది.

"కేటీఆర్‌ అరెస్టుకు గవర్నర్ అనుమతి ఇవ్వట్లే"

తె­లం­గాణ రా­జ­కీ­యా­ల్లో అత్యంత సం­చ­ల­నం సృ­ష్టి­స్తు­న్న ఈ ఫా­ర్మా­లా కేసు అం­శం­పై ము­ఖ్య­మం­త్రి రే­వం­త్ రె­డ్డి కీలక వ్యా­ఖ్య­లు చే­శా­రు. మాజీ మం­త్రి కే­టీ­ఆ­ర్‌­ను అరె­స్టు చే­యా­ల­న్నా, ఆయ­న­పై చా­ర్జి­షీ­ట్ దా­ఖ­లు చే­యా­ల­న్నా.. గవ­ర్న­ర్ అను­మ­తి తప్ప­ని­స­రి అని ము­ఖ్య­మం­త్రి రే­వం­త్ రె­డ్డి స్ప­ష్టం చే­శా­రు. కే­టీ­ఆ­ర్ వి­చా­ర­ణ­కు ఇప్ప­టి­కే గవ­ర్న­ర్ అను­మ­తి ఇచ్చి­నా.. చా­ర్జి­షీ­ట్‌­కు మా­త్రం ఇంకా ఆమో­దం లభిం­చ­లే­ద­న్నా­రు. 2018లో ‘ప్రి­వె­న్ష­న్ ఆఫ్ కర­ప్ష­న్ యా­క్ట్’ కు చే­సిన సవ­ర­ణల గు­రిం­చి ప్ర­స్తా­విం­చిన ము­ఖ్య­మం­త్రి.. ఏ మం­త్రి మీద వి­చా­రణ చే­యా­ల­న్నా, ఆ తర్వాత చా­ర్జి­షీ­ట్ వే­యా­ల­న్నా.. గవ­ర్న­ర్ అను­మ­తి తప్ప­ని­స­రి అని స్ప­ష్టం చే­శా­రు. ఈ ని­బం­ధ­నల ప్ర­కా­ర­మే, రా­ష్ట్ర ప్ర­భు­త్వం కే­టీ­ఆ­ర్ పట్ల వి­చా­రణ చే­య­డా­ని­కి గవ­ర్న­ర్ ఆమో­దం కో­ర­గా… గవ­ర్న­ర్ అను­మ­తి ఇచ్చా­ర­న్నా­రు. వి­చా­ర­ణ­లో ని­ర్ది­ష్ట­మైన ఆధా­రా­లు లభిం­చా­య­ని, దాని ఆధా­రం­గా చా­ర్జి­షీ­ట్ ఫైల్ చే­య­డా­ని­కి గవ­ర్న­ర్‌ ఆమో­దం కోసం పం­పిం­చా­మ­ని రే­వం­త్ రె­డ్డి తె­లి­పా­రు.

"కాంగ్రెస్‌ది అధికార దుర్వినియోగం"

జూ­బ్లీ­హి­ల్స్‌ అసెం­బ్లీ ఉప ఎన్ని­క­ల్లో ఓడి­పో­తు­న్నా­మ­నే భయం­తో కాం­గ్రె­స్ పా­ర్టీ­లో కని­పి­స్తోం­ద­ని బీ­ఆ­ర్ఎ­స్ నేత కే­ఆ­ర్ సు­రే­శ్ రె­డ్డి ఆరో­పిం­చా­రు. అం­దు­కే, సీఎం రే­వం­త్ రె­డ్డి, మం­త్రు­లు అధి­కార దు­ర్వి­ని­యో­గా­ని­కి పా­ల్ప­డు­తు­న్నా­ర­ని ఆరో­పిం­చా­రు. జూ­బ్లీ­హి­ల్స్ ఉప ఎన్ని­క­ల్లో ఓట­ర్లు స్వ­చ్ఛం­దం­గా పా­ల్గొ­నా­లం­టే కేం­ద్ర బల­గా­ల­ను పం­పిం­చా­ల­ని ఈసీ­ని కో­రా­మ­ని, దీ­ని­కి ఈసీ కూడా సా­ను­కూ­లం­గా స్పం­దిం­చిం­ద­ని తె­లి­పా­రు. కాం­గ్రె­స్ ప్ర­భు­త్వం అధి­కార దు­ర్వి­ని­యో­గం చే­స్తోం­ద­ని మం­డి­ప­డ్డా­రు.

Tags:    

Similar News