Sadar Festival: అరెరె.. ఏమైంది ఈ దున్నపోతుకు..?
Sadar Festival: ఖైరతాబాద్ చౌరస్తాలో దున్నపోతు హల్‌చల్ చేసింది.;
Sadar Festival (tv5news.in)
Sadar Festival: ఖైరతాబాద్ చౌరస్తాలో దున్నపోతు హల్‌చల్ చేసింది. సదర్ ఉత్సవాల్లో భాగంగా నిర్వహకులు ప్రత్యేక దున్నపోతులను సిద్ధం చేశారు. ఈసందర్భంగా ఓ దున్నపోతు తాడు తెంపుకుని పరుగులు తీసింది. అడ్డొచ్చిన వారి మీదకు పరిగెత్తింది. దీంతో దున్నపోతును కట్టడి చేయడానికి నిర్వహకుడు ప్రయత్నించినపటికి వీలు కాలేదు. ఈక్రమంలో దున్నపోతు స్కూటీతో పాటు మహిళను ఈడ్చుకెళ్లింది. దున్నపోతు దాడిలో మరో ఇద్దరికి గాయాలయ్యాయి. చివరకు కొందరు యువకులు దున్నపోతును పట్టుకుని కట్టేశారు.