Bhatti Vikramarka : భట్టి ఇంట్లో చోరీ కేసులో దొంగల నుంచి రికవరీ చేసింది ఇదే!

Update: 2024-09-28 10:45 GMT

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో చోరీ కేసులో ఇద్దరిని పశ్చిమ్‌బెంగాల్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఖరగ్‌పూర్‌ రైల్వేస్టేషన్‌లో ఏడో నంబర్‌ ప్లాట్‌ఫాంపై జీఆర్పీ పోలీసుల తనిఖీలు నిర్వహించారు. అక్కడ అనుమానాస్పదంగా కనిపించిన రోషన్‌కుమార్ మండల్‌, ఉదయ్‌కుమార్‌ ఠాకూర్‌ను విచారించారు. వీరిద్దరూ భట్టి విక్రమార్క విదేశీ పర్యటనలో ఉండగా ఆయన ఇంట్లో చోరీకి పాల్పడినట్లు అంగీకరించారు. వారి నుంచి 100 గ్రాముల బంగారు, వెండి ఆభరణాలతో పాటు రెండు లక్షల 20 వేల నగదు, విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు బిహార్‌కు చెందిన వారని ఖరగ్‌పూర్‌ జీఆర్పీ ఎస్పీ దేబశ్రీ సన్యాల్‌ వెల్లడించారు. ఈ విషయంపై తెలంగాణ పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు వెల్లడించారు. 

Tags:    

Similar News