BY POLL RESULT: నేడే జూబ్లీహిల్స్ తీర్పు

నేడే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్.. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ఆరంభం... మధ్యాహ్నం కల్లా పూర్తి ఫలితం వెల్లడి

Update: 2025-11-14 01:30 GMT

జూ­బ్లీ­హి­ల్స్‌ ని­యో­జ­క­వ­ర్గ ఉప ఎన్నిక ఫలి­తం­పై నె­ల­కొ­న్న ఉత్కం­ఠ­కు నే­టి­తో తె­ర­ప­డ­నుం­ది. ఉదయం 8 గం­ట­ల­కు ఓట్ల లె­క్కిం­పు ప్ర­క్రియ ప్రా­రం­భం కా­నుం­డ­గా, ఇం­దు­కు సం­బం­ధిం­చిన ఏర్పా­ట్ల­ను అధి­కా­రు­లు పూ­ర్తి చే­శా­రు. యూ­సు­ఫ్‌­గూ­డ­లో­ని కో­ట్ల వి­జ­య­భా­స్క­ర్‌­రె­డ్డి స్టే­డి­యం­లో ఈ కౌం­టిం­గ్ జర­గ­నుం­ది. ని­యో­జ­క­వ­ర్గం­లో­ని 407 పో­లిం­గ్‌ కేం­ద్రాల ఓట్ల­ను మొ­త్తం 10 రౌం­డ్ల­లో లె­క్కిం­చ­ను­న్నా­రు. ఇం­దు­కో­సం 42 టే­బు­ళ్ల­ను సి­ద్ధం చే­శా­రు. సా­ధా­ర­ణం­గా 14 టే­బు­ళ్ల­నే వి­ని­యో­గి­స్తు­న్న­ప్ప­టి­కీ, ఇది ఉప ఎన్నిక కా­వ­డం, సి­బ్బం­ది అం­దు­బా­టు­లో ఉం­డ­టం­తో లె­క్కిం­పు­ను వే­గం­గా పూ­ర్తి చే­సేం­దు­కు ఎక్కువ టే­బు­ళ్ల­ను ఏర్పా­టు చే­సి­న­ట్లు అధి­కా­రు­లు వి­వ­రిం­చా­రు. ప్ర­తి టే­బు­ల్ వద్ద కౌం­టిం­గ్ సి­బ్బం­ది­తో పాటు అభ్య­ర్థి, ఆయన ఏజెం­ట్‌­కు మా­త్ర­మే ప్ర­వే­శం కల్పి­స్తా­రు. లె­క్కిం­పు ప్ర­క్రియ తొ­లుత పో­స్ట­ల్ బ్యా­లె­ట్ల­తో ప్రా­రం­భ­మ­వు­తుం­ది. 10 హోం ఓటిం­గ్ బ్యా­లె­ట్లు, 18 సర్వీ­సు ఓట్ల­ను లె­క్కిం­చిన తర్వాత ఈవీ­ఎం­ల­లో­ని ఓట్ల లె­క్కిం­పు మొ­ద­ల­వు­తుం­ది. ఉదయం 8:45 గం­ట­ల­కే తొలి రౌం­డ్ ఫలి­తం వె­లు­వ­డు­తుం­ద­ని, మధ్యా­హ్నం 12 గంటల కల్లా పూ­ర్తి ఫలి­తం తే­లి­పో­తుం­ద­ని అధి­కా­రు­లు అం­చ­నా వే­స్తు­న్నా­రు.

తుది పోలింగ్ శాతం 48.49 శాతం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తుది పోలింగ్ శాతాన్ని అధికారులు అధికారికంగా ప్రకటించారు. మొత్తం 48.49 శాతం పోలింగ్ నమోదైనట్లు రిటర్నింగ్ అధికారి పి. సాయిరాం తెలిపారు. 2023 ఎన్నికల్లో నమోదైన 47.58 శాతం కంటే ఇది 0.91 శాతం అధికం కావడం గమనార్హం. ఫలితాల నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.

ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

జూ­బ్లీ­హి­ల్స్ ఉప ఎన్నిక ఓట్ల లె­క్కిం­పు­న­కు సం­బం­ధిం­చిన అన్ని ఏర్పా­ట్లు పూ­ర్తి చే­సి­న­ట్టు­గా జి­ల్లా ఎన్ని­కల అధి­కా­రి ఆర్వీ కర్ణ­న్ తె­లి­పా­రు. ఆర్‌­వీ కర్ణ­న్ గు­రు­వా­రం మీ­డి­యా­తో మా­ట్లా­డు­తూ... తొ­లుత పో­స్ట­ల్ బ్యా­లె­ట్ ఓట్లు కౌం­టిం­గ్ చే­స్తా­మ­ని చె­ప్పా­రు. మొ­త్తం 10 రౌం­డ్ల­లో కౌం­టిం­గ్ చే­స్తా­మ­ని తె­లి­పా­రు. కౌం­టిం­గ్ కోసం 42 టే­బు­ల్స్ ఏర్పా­టు చే­య­ను­న్న­ట్టు­గా చె­ప్పా­రు. కౌం­టిం­గ్ ప్ర­క్రి­య­ను పరి­శీ­లిం­చ­డా­ని­కి స్పె­ష­ల్ అధి­కా­రి­ని కూడా ఏర్పా­టు చే­య­డం జరి­గిం­ద­ని తె­లి­పా­రు. 186 మంది కౌం­టిం­గ్ సి­బ్బం­ది పని చే­స్తా­ర­ని చె­ప్పా­రు. కౌం­టిం­గ్‌­ను ఎప్ప­టి­క­ప్పు­డు ఆరో పరి­శీ­లి­స్తా­ర­ని తె­లి­పా­రు. రౌం­డ్ల వా­రీ­గా ఫలి­తా­ల­ను ఎప్ప­టి­క­ప్పు­డు ఈసీ వె­బ్‌­సై­ట్‌­లో అప్‌­లో­డ్ చే­స్తాం. అం­తే­కా­కుం­డా మీ­డి­యా­కు ప్ర­త్యే­కం­గా ఎల్‌­ఈ­డీ స్క్రీ­న్‌ ఏర్పా­టు చేసి ఫలి­తా­ల­ను వె­ల్ల­డి­స్తా­మ­ని తె­లి­పా­రు. కౌం­టిం­గ్​­కు మొ­త్తం 186 మంది సి­బ్బం­ది­ని కే­టా­యిం­చా­మ­ని, ఫలి­తా­ల­ను ఎప్ప­టి­క­ప్పు­డు ఈసీ వె­బ్​­సై­ట్​­లో అప్​­లో­డ్​ చే­స్తా­మ­ని వె­ల్ల­డిం­చా­రు. అన్ని పా­ర్టీల అభ్య­ర్థు­లు స్ట్రాం­గ్​ రూ­మ్​­ను సం­ద­ర్శిం­చా­రు. ఓట్ల లె­క్కిం­పు వి­ధు­ల్లో పా­ల్గొ­నే అధి­కా­రు­ల­కు గు­రు­వా­రం తుది విడత శి­క్షణ ఉం­టుం­ది. శు­క్ర­వా­రం వే­కు­వ­జా­మున వా­రం­తా స్ట్రాం­గ్​ రూ­ము­న­కు చే­రు­కుం­టా­రు. ఉదయం 5 గం­ట­ల­కే అభ్య­ర్థుల సమ­క్షం­లో జి­ల్లా ఎన్ని­కల అధి­కా­రి, రి­ట­ర్నిం­గ్​ అధి­కా­రి స్ట్రాం­గ్​ రూమ్ తలు­పు­లు తె­రి­చి లో­ప­లి­కి వె­ళ్తా­రు. ఈవీ­ఎం­ల­పై ఉండే సీ­ళ్లు, భద్రత ఏర్పా­ట్ల­ను సరి చూ­సు­కు­ని సవ్యం­గా ఉం­ద­ని ని­ర్ధా­రిం­చు­కు­న్న తర్వాత ఓట్ల లె­క్కిం­పు కేం­ద్రా­ని­కి వె­ళ్తా­రు. ఒక్కో రౌం­డు ఓట్ల లె­క్కిం­పు­న­కు 45 ని­మి­షాల సమయం పట్ట­నుం­ద­ని అం­చ­నా.

Tags:    

Similar News