TG : రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ

Update: 2025-01-02 07:00 GMT

తెలంగాణలో రైతు భరోసాపై మంత్రివర్గ ఉపసంఘం ఇవాళ సమావేశమైంది. సచివాలయంలో ఉదయం 11గంటలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభమైంది. మంత్రులు తుమ్మల, ఉత్తమ్, శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రైతు భరోసా విధివిధానాలను ఈ సమావేశంలో ఖరారు చేసే అవకాశం ఉంది. సంక్రాంతికి ముందే రైతు భరోసాను విడుదల చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఏడు ఎకరాలు కటాఫ్ గా పెట్టుకున్నట్టు ఇటీవల మంత్రులు ఓ ప్రకటనలో తెలిపారు. దీనిపై కూడా క్లారిటీ వచ్చే చాన్సుంది. 

Tags:    

Similar News