Hydra : హైడ్రాకు వ్యతిరేకంగా అత్తాపూర్‌లో క్యాండిల్ ర్యాలీ

Update: 2024-09-28 08:00 GMT

హైడ్రా అధికారుల సర్వేకు వ్యతిరేకంగా..రంగారెడ్డి జిల్లా అత్తాపూర్‌ లక్ష్మినగర్‌ వాసులు క్యాండిల్‌ ర్యాలీ నిర్వహించారు. తమ ఇళ్లపై మార్కింగ్‌ చేసింది చూస్తే తమ రక్తం చూసినట్లు ఉందని వారు వాపోయారు. "మేము హాయిగా బతుకుతున్నాం..మా ప్రశాంతతను భగ్నం చేయకండి అని ప్రభుత్వాన్ని కోరారు. మాకు భయం వద్దు, మాకు స్వేచ్ఛ కావాలి..ఎవరి ఇళ్లు ఎప్పుడు కూల్చేతారో తెలియక రాత్రి సమయంలో నిద్ర పట్టడం లేదు" ఆవేదన వ్యక్తం చేశారు. క్యాండిల్‌ ర్యాలీలో వందలాది మంది పాల్గొనడంతో..రోడ్డుపై ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది.

శుక్రవారం లంగర్ హౌజ్ లోనూ నిర్వాసితులు ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు సెక్యూరిటీ టైట్ చేశారు.

Tags:    

Similar News