TS : మాధవీలత కారుపై దాడిచేసిన మజ్లిస్ నేతలపై కేసు నమోదు

Update: 2024-05-16 16:27 GMT

హైదరాబాద్ లోక్ సభ బీజేపీ అభ్యర్థి మాధవిలత కారుపై మొఘల్ పురాలో మజ్లిస్ నేతలు, కార్యకర్తల దాడి వైరల్ అయింది. ఈ కేసులో ఎంఐఎం నాయకులపై కేసు నమోదు అయ్యింది.

మాధవి లత అనుచరుడు నసీం ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొఘలు పురాలో పోలీసులు కేసు నమోదు చేశారు. లోక్ సభ ఎన్నికల సందర్భంగా పోలింగ్ బూత్లను పరిశీలించడానికి వెళ్లిన మాధవి లత పై దాడి చేయడానికి యాకుత్ పురా ఎంఐఎం ఇంచార్జ్ యాసిర్ అరాఫత్ ప్రయత్నించారు.

మాధవీలత కారులో వెళుతుండగా వెంట పడి ఎంఐఎం నాయకులు దాడి చేయబోతయారు. బీబీ బజార్‌లో దాదాపు వంద మంది ఎంఐఎం నాయకులు మాధవి లతను ముట్టడించారు. ఈ నేపథ్యంలో ఫిర్యాదు అందుకున్న పోలీసులు 147, 506, 509, 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Tags:    

Similar News