మాస్క్ ధరించని 832 మందిపై కేసులు, వేయి జరిమానా : మహేశ్ భగవత్
మాస్క్ ధరించకపోతే కేసు నమోదు చేసి వేయి రూపాయల జరిమానా విధిస్తున్నామన్నారు రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్.;
మాస్క్ ధరించని 832 మందిపై కేసులు నమోదు చేసి జరిమానా విధించారు రాచకొండ పోలీసులు. మాస్క్ ధరించకపోతే కేసు నమోదు చేసి వేయి రూపాయల జరిమానా విధిస్తున్నామన్నారు రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్. సీసీ కెమెరాల ద్వారా మాస్క్ పెట్టుకోని వాళ్లను గుర్తించి కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. కరోనా వైరస్‌పై ప్రధాన కూడళ్లలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు 200 మందిని మించి పిలవోద్దని అన్నారు రాచకొండ సీపీ మహేశ్ భగవత్..