KTR: కేటీఆర్ కోలుకోవాలంటూ ప్రముఖుల ట్వీట్

కేటీఆర్ కు నడుముకు గాయం.. స్పందించిన పవన్, జగన్;

Update: 2025-04-29 05:00 GMT

జిమ్‌లో వర్కౌట్‌ చేస్తుండగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ గాయపడ్డారు. తన నడుముకు చిన్న గాయమైందంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. వైద్యుల సూచనతో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలిపారు. కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు ఆయనకు సూచించారు. ఈ విషయాన్ని కేటీఆర్‌ తన ‘ఎక్స్‌’ ఖాతాలో పోస్టు చేశారు. వైద్యుల పర్యవేక్షణలో రికవరీ అవుతున్నట్లు పేర్కొన్నారు. త్వరగా కోలుకొని రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.

పవన్ కల్యాణ్ స్పందన

రాజకీయంగా ఎలా ఉన్నా, వ్యక్తిగతంగా స్నేహితులు అనే విషయాన్ని జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి రుజువుచేశారు. కేటీఆర్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. కేటీఆర్‌ కోలుకోవాలని పవన్‌ కల్యాణ్‌ ఆకాంక్షించారు. తెలంగాణ మాజీ మంత్రి కె.టి.రామారావు జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా గాయపడ్డట్టు ఆయన పోస్టు చేయడంతో.. పవన్ కల్యాణ్ స్పందించారు. కె.టి.ఆర్. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, ఆయన ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.

స్పందించిన జగన్

జిమ్‌లో వర్కౌట్‌ చేస్తుండగా గాయపడిన మాజీ మంత్రి కేటీఆర్‌ త్వరగా కోలుకోవాలని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారు. ఈ మేరకు వైఎస్‌ జగన్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. బ్రదర్‌ కేటీఆర్‌.. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని వైఎస్‌ జగన్‌ పోస్టు చేశారు. 

Tags:    

Similar News