ఆసరా పెన్షన్ల కోసం కేంద్రం వెయ్యి కోట్లే ఇచ్చింది - మంత్రి హరీష్‌

సీఎం కేసీఆర్‌ కొండంత ఇస్తే.. కేంద్రం ఇచ్చింది గోరంత మాత్రమేనన్నారు మంత్రి హరీష్‌ రావు. నార్సింగ్‌ మండల కేంద్రంలో దుబ్బాక ఎన్నికల ప్రచారంలో భాగంగా..;

Update: 2020-10-31 11:54 GMT

సీఎం కేసీఆర్‌ కొండంత ఇస్తే.. కేంద్రం ఇచ్చింది గోరంత మాత్రమేనన్నారు మంత్రి హరీష్‌ రావు. నార్సింగ్‌ మండల కేంద్రంలో దుబ్బాక ఎన్నికల ప్రచారంలో భాగంగా అభ్యర్ధి సోలిపేట సుజాతకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు మంత్రి హరీష్‌. భారీ ర్యాలీ, బహిరంగసభ నిర్వహించారు. టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యమన్నారు మంత్రి హరీష్‌. ఆసరా పెన్షన్లు 30 వేల 423 కోట్లలో కేంద్రం ఇచ్చింది వెయ్యి కోట్లేనన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను కేంద్రం ఇవ్వడం లేదన్నారు మంత్రి హరీష్‌. బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు.

Tags:    

Similar News