Gachibowli Land Inspection : కంచ గచ్చిబౌలి భూముల్లో కేంద్ర కమిటీ సందర్శన
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ భూములను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు నియమించిన పర్యావరణ అటవీ శాఖ సాధికారిక కమిటీ గచ్చిబౌలి భూములను పరిశీలించింది. సుప్రీం నియమించిన ఈ కమిటీ బుధవారం రాత్రి ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకుంది. హోటల్ తాజ్ కృష్ణాలో బస చేసిన కమిటీ చైర్మన్ సిద్ధాంత దాస్, మరో ముగ్గురు సభ్యులు గురువారం ఉదయం 9 గంటలకు హోటల్ తాజ్ కృష్ణా నుంచి బయలుదేరి 10 గంటలకు గచ్చిబౌలి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్లింది. కంచ గచ్చిబౌలి భూముల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేసి వాస్తవ పరిస్థితుల అధ్యయనం చేసింది. ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశమై వివిధ అంశాలను ఆరా తీసింది.