హుజురాబాద్‌ ఉప ఎన్నికపై కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు..!

తెలంగాణలో పొలిటికల్ హీట్‌ను రాజేస్తున్న హుజురాబాద్‌ బైపోల్‌పై కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు మొదలుపెట్టింది.

Update: 2021-07-17 15:30 GMT

తెలంగాణలో పొలిటికల్ హీట్‌ను రాజేస్తున్న హుజురాబాద్‌ బైపోల్‌పై కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు మొదలుపెట్టింది. త్వరలో ఉప ఎన్నిక జరిగే అవకాశం కనిపిస్తోంది..అక్టోబర్ లేదా నవంబర్‌లో ఎన్నికలు ఉంటాయని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఖాళీగా వున్న లోకసభ, అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలపై CEC దృష్టిసారించింది.. అయా స్థానాలకు ఉపఎన్నికల షెడ్యూల్‌పై కసరత్తు ముమ్మరం చేసింది. ప్రస్తుతం దేశంలో 23 అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలు, 8 రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. కొవిడ్ కారణంగా గతంలో అన్ని ఉపఎన్నికలు వాయిదా వేసింది ఎన్నికల సంఘం. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గడంతో మళ్లీ ఉపఎన్నికల నిర్వహణపై ఫోకస్ చేస్తోంది. అయితే 2022లో సాధారణ ఎన్నికలు జరిగే యూపీ, ఉత్తరాఖండ్‌లోని 6 స్థానాలకు ఉప ఎన్నికలు జరగకపోవచ్చని సమాచారం. మొత్తానికి అక్టోబర్ లేదా నవంబరు నాటికే అన్ని స్థానాలకు ఉపఎన్నికలు పూర్తిచేయాలని భావిస్తోంది CEC.

Tags:    

Similar News