Telangana : ధాన్యం సరఫరాపై తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం చివరి అవకాశం
Telangana : ధాన్యం సరఫరాపై తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం చివరి అవకాశమిచ్చింది.;
Telangana : ధాన్యం సరఫరాపై తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం చివరి అవకాశమిచ్చింది. 2020-21 రబీ సీజన్ ధాన్యం సరఫరా కోసం మే31 వరకు సమయమిస్తూ 7వ సారి గడువు పొడిగించింది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇప్పటికే 6 సార్లు గడువు పొడిగించిన FCI.... చివరి అవకాశమిస్తూ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. FCI లేఖపై ప్రకటన విడుదల చేశారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. ఎన్నిసార్లు గడువు పొడిగించినా తెలంగాణ ప్రభుత్వం నుంచి స్పందనలేదన్నారు. తాను రాసిన లేఖకు స్పందించి, కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ ప్రభుత్వానికి మరో అవకాశాన్నిచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం FCI చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుందని ఆశిస్తున్నానని తెలిపారు కిషన్ రెడ్డి.