చలో రాజ్‌భవన్ కార్యక్రమం నిర్వహిస్తోంది టీపీసీసీ. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్ కార్యక్రమంలో పెద్దఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. నెక్లెస్ రోడ్‌లోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద భారీ జన సమీకరణతో రాజ్ భవన్ వరకు ప్రదర్శనగా ‘చలో రాజ్ భవన్’ నిర్వహించారు. అమెరికాలో గౌతమ్ అదానీపై వచ్చిన ఆర్థిక అవకతవకలు దేశ వ్యాపార, ఆర్థిక రంగాలలో పరువును దెబ్బతీశాయనీ... మణిపూర్‌లో జరిగిన అల్లర్లు, జరిగినా ప్రధాని మోదీ ఇప్పటివరకు ఆ రాష్ట్రాన్ని సందర్శించకపోవడాన్ని నిరసనగా ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు చలో రాజ్ భవన్ నిర్వహిస్తున్నారు కాంగ్రెస్ నేతలు.