NV Ramana : ఓయూలో డాక్టరేట్ అందుకున్న సీజేఐ ఎన్వీ రమణ
NV Ramana : విద్యార్థులకు ప్రాథమిక న్యాయ సూత్రాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సీజేఐ ఎన్వీ రమణ అన్నారు;
NV Ramana : విద్యార్థులకు ప్రాథమిక న్యాయ సూత్రాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో 82వ స్నాతకోత్సవాల సందర్భంగా ఆయనకు గవర్నర్ తమిళిసై గౌరవ డాక్టరేట్ అందజేశారు.
ప్రపంచీకరణతో స్థానిక భాష, సంస్కృతులకు ముప్పు వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మన మూలాలతో ముడిపడి ఉన్న ఆహారం, భాష, వస్త్రధారణ, ఆటలు, పండుగలు, కన్న ఊరు ఆవశ్యకతను పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. విద్యార్థులు సాహిత్యం, పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు.