Chikoti Praveen: చికోటి ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు.. బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ..
Chikoti Praveen: క్యాసినో వ్యవహారంలో చికోటి ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.;
Chikoti Praveen: క్యాసినో వ్యవహారంలో చికోటి ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు విదేశాల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయన్నారు. హిట్‌మెన్ అనే విదేశీ యాప్‌లో సుపారీ ఇచ్చామని బెదిరిస్తున్నారని చికోటి తెలిపారు. తన ఇంటి వద్ద కూడా గుర్త తెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహించారని.. బెదిరింపులపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. భద్రత కోసం హైకోర్టులో కూడా పిటిషన్ వేసినట్లు తెలిపారు.
ఇక క్యాసినో కేసులో ఈడీ విచారణ జరుగుతుందని చికోటి ప్రవీణ్ తెలిపారు. తన ఫామ్‌హౌస్‌లో జంతువుల పెంపకానికి అన్ని అనుమతులు ఉన్నాయన్నారు. తన దగ్గర ఉన్న పురాతన వస్తువులను కేరళ మ్యూజియం నుంచి కొనుగోలు చేసినట్లు తెలిపారు. తాను ఏతప్పు చేయలేదని.. ఈడీ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానన్నారు. ఈడీ విచారణకు ఎప్పుడు పిలిచినా వెళ్లడానికి సిద్ధమేనన్నారు చికోటి ప్రవీణ్.