Hyderabad: 'ఎమ్మెల్యే అంకుల్, కమీషనర్ అంకుల్ ప్లీజ్ సేవ్ అజ్'.. వినూత్నంగా చిన్నారుల నిరసన..
Hyderabad: వీధికుక్కలనుంచి తమను కాపాడాలంటూ హైదరాబాద్‌లోని జీడిమెట్లకు చెందిన చిన్నారులు వినూత్న నిరసన తెలిపారు.;
Hyderabad: వీధికుక్కలనుంచి తమను కాపాడాలంటూ హైదరాబాద్‌లోని జీడిమెట్లకు చెందిన చిన్నారులు వినూత్న నిరసన తెలిపారు. MLA అంకుల్, కమీషనర్ అంకుల్ ప్లీజ్ సేవ్ అజ్ ఫ్రం స్ట్రీట్ డాగ్స్ అంటూ రోడ్డుపై నిరసన తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజవర్గం కొంపల్లి మున్సిపాలిటి పరిధిలోని నార్త్ ఎవెన్యూ కాలనీలో గత కొద్దిరోజులుగా చిన్నారులు వీధికుక్కల దాడికి గురవుతున్నారు. దీనిపై ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో చిన్నారులు, వారి తల్లిదండ్రులతో కలిసి రోడ్డుపై నిరసన తెలిపారు.