Deadly kite : మెడకు చుట్టుకున్న చైనా మాంజా.. వ్యక్తికి తీవ్ర గాయాలు

నిషేధం ఉన్నా లభిస్తున్న చైనా మాంజా.. వాడొద్దని పోలీసుల హెచ్చరిక;

Update: 2025-01-02 08:15 GMT

పతంగి మాంజా ఎంత ప్రాణాంతకమో చెప్పే మరో ఘటన జరిగింది. పతంగి ఎగరేసేందుకు వాడిన నిషేధిత చైనా మాంజా ధారం దారిన వెలుతున్న ద్విచక్ర వాహనదారుడి మెడకు చుట్టుకోవడంతో అతని మెడ తెగి తీవ్ర రక్తస్రావమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరంలో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే స్థానికులు కొత్తగూడెంలోని ఆసుపత్రికి తరలించారు.

నిషేధం ఉన్నా దొరుకుతోంది..

చైనా మాంజాపై నిషేధం ఉన్నప్పటికి మార్కెట్ లో అది విరివిగా దొరుకుతుంది. చైనా మాంజాపై అవగాహాన లేని పిల్లలు దానిని కొనుగోలు చేస్తూ పతంగులు ఎగరేసేందుకు వాడుతున్నారు. చైనా మాంజా ధారాలు తగిలి గతంలోనూ వివిధ చోట్ల పలువురు ప్రాణాలు కోల్పోయారు. పక్షులకు గాయాలు, మరణాలు మరింత ఎక్కువగా జరుగుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా పతంగులు ఎగరేసే వారు చైనా మాంజా ధారం వినియోగానికి దూరంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

పతంగులతో జర పైలం

సంబురాల సంక్రాంతి వచ్చేసింది. గాలిపటాలతో ఆకాశం కళకళలాడుతోంది. అయితే పతంగులు ఎగురవేసే సమయంలో జర భద్రంగా ఉండాలి. ముఖ్యంగా చైనా మాంజాను వాడకపోవడం మంచిది. తాజాగా హైదరాబాద్‌లోని ఆసిఫ్‌నగర్‌లో ఒకరు, రంగారెడ్డి జిల్లా, షాద్‌నగర్‌లో బైక్ పైన వెళ్తున్న దంపతులు మాంజాతో గాయాలపాలయ్యారు. గతంలోనూ పలువురు మాంజా కారణంగా ప్రణాలను కోల్పోయిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News