TG : అవినీతికి పాల్పడితే ఉద్యోగం ఊస్ట్.. సిటీ సీపీ కొత్తకోట

Update: 2024-08-27 11:30 GMT

విధి నిర్వహణలో లంచాలు, నిందితులకు కొమ్ము కాయడం, కేసు పక్కదారి పట్టించే పోలీసులను సస్పెన్షన్ తో సరిపెట్టకుండా శాశ్వతంగా ఉద్యోగం ఊడగొడతామని సీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్ పోలీసులపై అవినీతి ఆరోపణలు రావడంతో సీపీ స్పందించారు.

పోలీసు స్టేషన్లకు వచ్చే బాధితుల నుంచి లంచాలు, వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ మరోసారి స్పష్టం చేశారు. పోలీసులు అవినీతికి పాల్పడినట్టు రుజువైతే ఉద్యోగం నుంచి పూర్తిగా తొలగిస్తామని తేల్చి చెప్పారు. పలుమార్లు హెచ్చరించినప్పటికీ తీరుమార లేదని, పద్దతి మార్చుకోని పోలీసు అధికారులపై మరింత నిఘా పెడతామని వివరించారు. నగరంలోని మసాజ్ సెంటర్లు, చిరు వ్యాపారులు, పాన్ షాపుల వద్ద అక్రమ వసూళ్లకు పాల్పడొద్దని పోలీసులకు సీపీ సూచించారు.

అవినీతికి పాల్పడిన వారిని గుర్తించి సర్వీస్ నుంచి తొలగిస్తామని సీపీ వార్నింగ్ ఇచ్చారు. కానిస్టేబుల్ స్థాయి నుంచి అవినీతి ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. ఆ క్రమంలోనే పోలీసుల అవినీతి ఆరోపణలపై సీపీ ఘాటుగా స్పందించారు. ఇక అవినీతి కేసులలో సస్పెండ్ చేయడం అంటూ ఉండదని, సర్వీస్ నుంచి తొలగిస్తామని హెచ్చరించారు.

Tags:    

Similar News