మహబూబాబాద్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ సమావేశంలో రసాభాస
ఇరువర్గాలకు ఉత్తమ్ సర్దిచేప్పేందుకు ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. అరగంట తర్వాత కార్యకర్తలు శాంతించడంతో సమావేశం తిరిగి ప్రారంభమైంది.;
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం రసాభాసగా మారింది. పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైన ఈ భేటీలో.. రామ చంద్రునాయక్ పేరు పిలిచి నెహ్రూ నాయక్ పేరు పిలవకపోవడంతో గొడవ మొదలైంది. అలాగే... మురళీనాయక్ వర్గీయులు.. బలరామ్ నాయక్ వర్గీయులకు మధ్య ఘర్షణ జరిగింది.
ఉత్తమ్ కుమార్ రెడ్డి ముందే కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. ఒకరికి వ్యతిరేకంగా ఒకరు నినాదాలు చేసుకున్నారు. ఇరువర్గాలకు ఉత్తమ్ సర్దిచేప్పేందుకు ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. అరగంట తర్వాత కార్యకర్తలు శాంతించడంతో సమావేశం తిరిగి ప్రారంభమైంది.
నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గం అభ్యర్థులుగా అన్ని పార్టీలు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారినే బరిలో నిలిపారని... కాంగ్రెస్ మాత్రమే గిరిజన బిడ్డను పోటీకి దింపిందని ఉత్తమ్ అన్నారు.మహబూబాబాద్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ సమావేశంలో రసాభాసరాబోయే ఎన్నికల్లో రాములునాయక్‌కు మొదటి ప్రాధాన్య ఓటు వేసి గెలిపించాలని ఉత్తమ్ పట్టభద్రులను కోరారు.