రేపు హాలియాకి సీఎం కేసీఆర్..!
రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం హాలియాలో పర్యటించనున్నారు.;
రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం హాలియాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సాగర్ ఉప ఎన్నిక సమయంలో నియోజకవర్గంలో పర్యటించిన సీఎం కేసీఆర్.. ఆనాడు అనేక హామీలు ఇచ్చారు. ఆ హామీలను అమలు చేయడంలో భాగంగానే హాలియా పర్యటనకు వెళ్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.. సీఎం పర్యటన నేపథ్యంలో బందోబస్తు ఏర్పాట్లను డీఐజీ రంగనాథ్, జిల్లా కలెక్టర్ పాటిల్ స్వయంగా పరిశీలించారు.