ప్రగతిభవన్‌లో టీఆర్‌ఎస్‌ ఎంపీలతో సీఎం కేసీఆర్‌ సమావేశం

టీఆర్‌ఎస్‌ ఎంపీలతో సీఎం కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో సమావేశం నిర్వహించారు.. పార్లమెంటులో అనుసరించాల్సిన..

Update: 2020-09-10 16:03 GMT

టీఆర్‌ఎస్‌ ఎంపీలతో సీఎం కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో సమావేశం నిర్వహించారు.. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్రం వైఖరి, కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్‌ సంస్కరణల్లో రాష్ట్ర విధానం, జీఎస్టీ విషయంలో కేంద్రం తీరు తదితర అంశాలపై చర్చించారు. సమావేశం అనంతరం టీఆర్‌ఎస్‌ ఎంపీలు మీడియాతో మాట్లాడారు.

కేంద్ర ప్రభుత్వ అసమర్థత వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజలు ఇబ్బంది పడాలా అని టీఆర్‌ఎస్‌ ఎంపీలు అన్నారు. రాష్ర్టానికి అవసరమున్న యూరియా కేంద్రం ఇవ్వలేదన్నారు. ప్రజా వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదిత విద్యుత్‌ సవరణ బిల్లు ఉందన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లను స్థానిక నేతలు అంగీకరిస్తారా? అని ప్రశ్నించారు. తమతో వచ్చేవారితో కలిసి విద్యుత్‌ బిల్లును వ్యతిరేకిస్తామని చెప్పారు. సమస్యలపై రాజీ పడేది లేదన్న ఎంపీలు.. ఇచ్చిన హామీలు మర్చిపోతారా? ప్రజలను మభ్యపెడతారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

Tags:    

Similar News