ప్రగతి భవన్‌లో బడ్జెట్‌పై సీఎం కేసీఆర్ సమీక్ష
2021-22 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ బడ్జెట్ కసరత్తు ప్రారంభమైంది. ఇదే అంశంపై ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ సమీక్షనిర్వహిస్తున్నారు.;
2021-22 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ బడ్జెట్ కసరత్తు ప్రారంభమైంది. ఇదే అంశంపై ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ సమీక్షనిర్వహిస్తున్నారు. ఇందులో ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్, సీఎస్, ఆర్థికశాఖ అధికారులు పాల్గొంటున్నారు.
గత ఏడాది ఒక లక్ష 82 వేల కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. ఐతే.. కరోనా ప్రభావంతో కేటాయింపులకు సర్కారు ఇబ్బందిపడింది. ఆదాయంలో భారీ తగ్గుదల నేపథ్యంలో 2020-21 బడ్జెట్ అంచనాల్లో ఆర్థిక శాఖ అధికారులు మార్పులు, సవరణలు చేశారు.
ఈసారి కేంద్ర బడ్జెట్‌తో రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. పన్నుల్లో రాష్ట్రాల వాటా 50 శాతానికి పెంచమని కోరినా.. కేంద్ర ఆర్థిక శాఖ పరిగణనలోకి తీసుకోలేదు. నీటి ప్రాజెక్టుల నిర్వహణకు.. మిషన్ భగీరథకు నిధులు లేవు. విద్యుత్ ప్రాజెక్టులకు, విద్యా రంగానికి ప్రత్యేకంగా నిధులు ఇవ్వలేదు.
ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి బడ్జెట్.. గత ఏడాది బడ్జెట్‌ను మించదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.