ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ అప్పులు తక్కువ : సీఎం కేసీఆర్
బడ్జెట్‌లో కేటాయింపులపై ప్రతిపక్షాల ఆరోపణలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు పాము కథ చెప్పి చురకలంటించారు.;
బడ్జెట్‌లో కేటాయింపులపై ప్రతిపక్షాల ఆరోపణలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు పాము కథ చెప్పి చురకలంటించారు. ఓవైపు కరోనాతో ప్రపంచం మొత్తం అతలాకుతలం అయితే.. భట్టి విక్రమార్క బడ్జెట్‌లో కేటాయింపులు చేయలేదని విడ్డూరంగా ఉందని విమర్శించారు. వ్యవసాయ రంగంలో 17.73శాతం వృద్ధి నమోదైందని వెల్లడించారు. దేశంలో ఎఫ్‌సీఐ సేకరించిన ధాన్యంలో 55శాతం తెలంగాణ నుంచి సేకరించినదేనని చెప్పారు. రాష్ట్రంలో అప్పులు పెరిగాయనే వాదన సరికాదని.. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ అప్పులు చాలా తక్కువ అని స్పష్టంచేశారు. అప్పుల విషయంలో తెలంగాణ 22వ స్థానంలో ఉందని.. కరోనా తట్టుకుని తక్కువ అప్పులు చేసిన రాష్ట్రం తెలంగాణ అని సీఎం కేసీఆర్ ప్రతిపక్షాల ఆరోపణలకు ధీటుగా సమాధానం ఇచ్చారు.