CM Revanth Reddy : పదవీకాలం పూర్తయిన ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ సన్మానం

Update: 2025-03-28 08:00 GMT

పదవీకాలం ముగిసిన 8 మంది ఎమ్మెల్సీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్మానించారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు మహమూద్ అలీ, శేరి సుభాష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎగ్గే మల్లేశంతో పాటు ఎంఐఎం సభ్యుడు మీర్జారియాజ్ ఉల్ హసన్ అఫెండీ, టీచర్ ఎమ్మెల్సీలు రఘోత్తం రెడ్డి, నర్సిరెడ్డి పదవీకాలం శుక్రవారంతో ముగుస్తోంది. దీంతో అసెంబ్లీ సమావేశాల చివరిరోజు గురువారం శాసనమండలి ఆవరణలో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో సన్మానించి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్య క్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కోటాలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, డాక్టర్ దాసోజు శ్రవణ్, టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఏప్రిల్ మొదటి వారంలో ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News