రైతు రుణమాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారని, ఈ విషయం ఇంటింటికీ వెళ్లి చెప్పాలని పార్టీ శ్రేణులకు సీఎం రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) సూచించారు. ఊరూరా సంబరాలు నిర్వహించాలని చెప్పారు. రుణమాఫీపై జాతీయ స్థాయిలోనూ చర్చ జరగాలని, పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీలు ఈ విషయాన్ని ప్రస్తావించాలని దిశానిర్దేశం చేశారు. తన జీవితంలో ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు అని సీఎం వ్యాఖ్యానించారు. రూ.లక్షలోపు రైతు రుణాలను ప్రభుత్వం ఇవాళ మాఫీ చేయనుంది. దీంతో ఆపై లోన్ ఉన్న ఉన్నవాళ్లకు ఎప్పుడనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఈనెలాఖరులోగా రూ.లక్షన్నర వరకు ఉన్న రుణాలు మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రూ.లక్షన్నర నుంచి రూ.2 లక్షల వరకు ఉన్న లోన్లను ఆగస్టు 15లోపు మాఫీ చేయనున్నట్లు సీఎం తెలిపారు.