సీఎం రేవంత్ రెడ్డి ( Revanth Reddy ), బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసి డెంట్ కేటీఆర్ ( KTR ) ఒకే వేదికను పంచుకోబోతున్నారు. ఇటీవల మరణించిన సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంస్కరణ సభను ఈనెల 21న హైదరాబాద్లో ఆ పార్టీ నిర్వహించబోతోంది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఆహ్వానం అందింది. ఈ విషయాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మి నేని వీరభద్రం తెలిపారు.
ఇరువురు అగ్రనేతలు ఈ సమావేశానికి హాజరయ్యేందుకు అంగీకారం తెలిపారని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎఎస్ పై, ఆ పార్టీ అధినేత కేసీఆర్ పై సీఎం రేవంత్ ఒంటికాలిపై లేస్తున్నారు. బీఅర్ఎస్ నేత కేటీఆర్ కూడా అంతే స్థాయిలో రేవంత్ ఆరోపణలకు ధీటుగా సమాధానం చెబుతున్నారు. సచివాలయం ఎదుట ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ, తాజాగా పబ్లిక్ గార్డెన్స్ లో జరిగిన ప్రజాపాలన దినోత్సవంలో మాట్లాడిన సీఎం రేవంత్ కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకుని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో ఇరువురు ఈ అగ్రనేతలు ఒకే వేదికపైకి రానుండటం ఆసక్తిని రేపుతోంది.