CM Revanth Reddy: బీజేపీ- బీఆర్ఎస్‌పై రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

రిజర్వేషన్లు రద్దు చేయాలనేదే బీజేపీ నిర్ణయం : తెలంగాణ సీఎం

Update: 2024-04-28 04:00 GMT

RSS విధానం ప్రకారం  భారతదేశాన్ని రిజర్వేషన్ రహిత దేశంగా మార్చాలని మోదీ, అమిత్ షా భావిస్తున్నారని..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. 2025 నాటికి రాజ్యాంగాన్ని మార్చి, రిజర్వేషన్లు రద్దు చేయాలనేది RSS లక్ష్యమని రేవంత్ అన్నారు.రాజ్యాంగాన్ని మార్చాలంటే మూడింట రెండొంతుల మెజార్టీ అవసరం కాబట్టే.. 400 సీట్లు గెలుస్తామని పదేపదే చెబుతున్నారని సీఎం విమర్శించారు. 400 సీట్లు వస్తే ఎవరి అవసరం లేకుండా రిజర్వేషన్లు రద్దు చేయొచ్చనేది భాజపా కుట్ర అని ఆరోపించారు.

ఎస్సీ, ఎస్టీ,బీసీ రిజర్వేషన్లు ఉండాలంటే కాంగ్రెస్ ను గెలిపించాలని కోరిన రేవంత్..ఆయారిజర్వేషన్లు రద్దు కావాలనుకుంటే భాజపాకు ఓటు వేయమని సూచించారు. మైనార్టీల రిజర్వేషన్లు రద్దు చేస్తామని అమిత్ షా చేసిన ప్రకటనను..కేసీఆర్ ఎందుకు ఖండించలేదని రేవంత్ ప్రశ్నించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలపై  ప్రధాని మోదీ సర్జికల్ స్ట్రైక్స్ చేస్తున్నారని ఆరోపించారు.  లోక్ సభ ఎన్నికల్లో భారాస, భాజపా కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని సీఎంరేవంత్ రెడ్డి మరోసారి ఆరోపించారు. మల్కాజ్ గిరిలో  భాజపానే గెలుస్తుందని చెప్పిన ఎమ్మెల్యే మల్లారెడ్డిపై...భారాస ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. పదేళ్ల పాటు కేసీఆర్ భూములు అమ్ముతుంటే మాట్లాడని ఈటల రాజేందర్ తాను రుణమాఫీ చేస్తానని అనగానే భూములు అమ్మవద్దని షరతులు పెడుతున్నారని విమర్శించారు. 

బీజేపీ- బీఆర్ఎస్ మధ్య ఒప్పందం బయటపడింది.. ఈటల రాజేందర్ గెలుస్తారన్న మల్లారెడ్డి వ్యాఖ్యలే దీనికి అద్దం పడుతున్నాయి.. బీజేపీ గెలుస్తుందన్న మల్లారెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు.. 5 సీట్లకు వారి మధ్య ఒప్పందం కుదిరింది.. అంటూ మరోసారి సీఎం రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్, బీజేపీపై సంచలన ఆరోపణలుచేశారు. శనివారం మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి పలు సంచలన వ్యాఖ్యలుచేశారు. ఒప్పందంలో భాగంగానే ఈటలను గెలిపించడానికి సిద్దమయ్యారని.. రాజ్యాంగం మార్చాలన్న కేసీఆర్‌ గతంలో చేసిన వ్యాఖ్యలు కూడా బీజేపీ అజెండానే అంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అందుకోసమే.. ఈటలకు వ్యతిరేకంగా కేసీఆర్‌ ఎక్కడా మాట్లాడలేదన్నారు. బీజేపీ, బీఆర్ఎస్‌ ఒక్కటే అనడానికి.. మల్లారెడ్డి, ఈటల సంభాషణే నిదర్శనమన్నారు. బీజేపీతో చీకటి ఒప్పందం లేకపోతే..మీ మేడ్చల్‌ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలంటూ రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. 

Tags:    

Similar News