మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. మహా ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని స్టార్ క్యాంపెయినర్‌గా నియమించింది. మహారాష్ట్రలో ఇతర రాష్ట్రాల సీఎంలతో కలిసి రేవంత్ రెడ్డి విలేకరుల సమావేశంలో పాల్గొంటారు. పర్యటన తర్వాత తిరిగి రాత్రి హైదరాబాద్ చేరుకోనున్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను అధిష్టానం జార్కండ్ లో జరగనున్న ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు స్టార్ క్యాంపెయినర్‌గా నియమించింది. ఆయన కూడా జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. తిరిగి రేపు రాత్రి తిరిగి హైదరాబాద్‌కు వస్తారు. రాష్ట్రంలో ఆరు గ్యారెంటీల అమలు, రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేయడం, వచ్చిన పది నెలల్లోనే ఉద్యోగ నియామకాలు, నియామక పత్రాలు అందజేయడం, మహిళలకు ఫ్రీ బస్ పథకాలను అస్త్రాలుగా చేసుకుని ఇతర రాష్ట్రాల్లో ప్రచారానికి సిద్ధమవుతున్నారు.