TG : కొత్త గవర్నర్‌తో సీఎం రేవంత్ భేటీ.. ఇదే హాట్ టాపిక్

Update: 2024-07-29 08:15 GMT

తెలంగాణకు నూతన గవర్నర్ గా నియమితులైన జిష్ణుదేవ్ వర్మను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. రాజ్ భవన్ కు వెళ్లిన సీఎం రేవంత్.. పుష్పగుచ్ఛంతో ఆయనకు అభినందనలు తెలిపారు. తెలంగాణలోని తాజా పరిస్థితులు, పెండింగ్ సమస్యలపై చర్చించారు. మండలి సభ్యుల అంశం, శాసన మండలి రద్దు అంశం కూడా ఇద్దరి మధ్య చర్చకు వచ్చినట్టు సమాచారం.

ఒకరోజు ముందే గవర్నర్ కు సోషల్ మీడియాలో స్వాగతం పలికారు సీఎం రేవంత్. 'జిష్ణుదేవ్ కు వెల్కమ్' అంటూ ట్విట్జర్ ఎక్స్ వేదికగా ఆహ్వానించారు. కొత్త గవర్నర్ గా వర్మను కేంద్రం నియమించడంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. కొత్త గవర్నర్ నియమించబడ్డ జిష్ణుదేవ్ వర్మను తెలంగాణ ప్రజల తరఫున స్వాగతిస్తున్నట్లు తెలిపారు. అన్ని విధాలుగా భవిష్యత్ ప్రయత్నాలకు

ఆకాంక్షిస్తూ.. శుభాకాంక్షలు తెలిపారు.

ఇన్నాళ్లు తెలంగాణ గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వహించిన జార్ఖండ్ గవర్నర్ కృష్ణను కేంద్రం మహారాష్ట్రకు బదిలీ చేసింది. ఆదివారం రాత్రి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ సహా మొత్తం 10 రాష్ట్రాలకు గవర్నర్లను నియమించింది.

Tags:    

Similar News