TG : సీఎం రేవంత్‌ రెడ్డి సెక్యూరిటీ మార్పు

Update: 2024-10-29 09:00 GMT

జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నివాసం వద్ద భద్రతా ఏర్పాట్లలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు సీఎం ఇంటివద్ద బందోబస్తు విధులు నిర్వహించిన బెటాలియన్ పోలీస్ సిబ్బందిని సీఎం సెక్యూరిటీ వింగ్‌ తప్పించింది. వారి స్థానంలో ఆర్మ్‌డ్‌ రిజర్వ్ (ఏఆర్) సిబ్బందితో భద్రత కల్పించింది. సీఎం ఇంటికి మూడు వైపులా ఉన్న 22 మంది టీజీఎస్‌పీ సిబ్బందిని మార్చి ఏఎర్ సిబ్బందిని నియమించారు. గత కొన్ని రోజులుగా బెటాలియన్‌ పోలీసులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు ఈ మార్పులు చేశారు.

Tags:    

Similar News