CM Revanth Reddy : హిందూ, ముస్లిం వేడుకలకు ఒకేరోజు సీఎం రేవంత్ హాజరు

Update: 2025-03-29 12:30 GMT

వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సాయంత్రం నాలుగు గంటలకు పట్టణ కేంద్రంలో జరగనున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర బ్రహ్మోత్సవాలకు హాజరవుతారు. రాఘవేంద్ర ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు హాజరై, ముస్లింలకు ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్, జిల్లా ఎస్పీ కే నారాయణ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు పరిశీలించారు. 

Tags:    

Similar News