సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్తున్నారు. దాదాపు రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే ఉండనున్నారు. కాంగ్రెస్ పెద్దలు రాహుల్ గాంధీతో పాటు పలువురు కీలక నేతలను కలవనున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ సహా పార్టీకి సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు. అదేవిధంగా పలువురు కేంద్ర మంత్రులతోనూ సీఎం రేవంత్ సమావేశం కానున్నారు.
ఈ పర్యటనలో ప్రధాని మోడీతో రేవంత్ సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయి. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం దక్కేలా చూడాలని మోడీని కోరనున్నారు. దీనికి సంబంధించిన ప్రధానితో కీలక చర్చలు జరుపుతారు. ఇదే విషయంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సైతం చర్చించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.