CM Revanth : సీఎం రేవంత్ 'గాంధీ'గిరి.. దిక్కుతోచని స్థితిలో బీఆర్ఎస్‌

Update: 2024-09-11 08:15 GMT

పీఏసీ చైర్మన్ పదవిని ప్రధాన ప్రతిపక్షానికి ఇచ్చే సంప్రదాయం అసెంబ్లీలో ఉంది. పీఏసీ పదవికి నామినేషన్ వేసే కొన్ని రోజుల ముందు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయినా గాంధీ సాంకేతికంగా బీఆర్ఎస్ పార్టీకి చెందినవారేననీ ఇటు కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఆయి శాసనసభ సచివాలయం చెబుతోంది.

పీఏసీ చైర్మన్ గా బీఆర్ఎస్ అధినాయకత్వం మాజీ మంత్రి హరీష్ రావు పేరును సూచించింది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ వ్యూహాత్మకంగా గాంధీ పేరును తెరపైకి తీసుకొచ్చారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హెూదా దక్కించుకుంది. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా 12 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ ఆకర్షించింది. దీంతో కాంగ్రెస్ కు దక్కాల్సిన పీఏసీ చైర్మన్ పదవిని అప్పటి సీఎం కేసీఆర్ ఎంఐఎంకు కట్టబెట్టారు.

అప్పుడు కేసీఆర్ వేసిన ప్రణాళికనే ఇప్పుడు కాంగ్రెస్ అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది. తమ పార్టీలో చేరిన గాంధీని పీఏసీ చైర్మన్ పదవిలో కూర్చోబెట్టి బీఆర్ఎస్ కు చెమటలు పట్టించింది.

Tags:    

Similar News