CM Revanth Reddy : డిసెంబర్ 9 సందర్భంపై సీఎం రేవంత్ కీలక ప్రకటన

Update: 2024-12-09 10:15 GMT

డిసెంబర్ 9 తెలంగాణ రాష్ట్రం ఏర్పడేందుకు పునాది పడిన రోజన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2009 డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటు ప్రకటనను సోనియాగాంధీ ప్రకటించారన్నారు. సచివాలయం సాక్షిగా తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించుకుంటున్నామని సీఎం రేవంత్ అన్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో ... తెలంగాణ తల్లికి గుర్తింపు లేదన్నారు. మన సంస్కృతి.. సంప్రదాయాలకు తగ్గట్టుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించుకుంటున్నామని అసెంబ్లీలో సీఎం రేవంత్ తెలిపారు. చరిత్ర ఉన్నంత వరకు తెలంగాణ తల్లి నిలిచిపోవాలని సచివాలయంలో విగ్రహాన్ని ఆవిష్కరించుకుంటున్నామన్నారు.

తెలంగాణ ప్రజలకు డిసెంబర్ 9 ఎంతో ముఖ్యమైన రోజని మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాష్కరణ బృహత్తరమైన కార్యక్రమమన్నారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. భేషజాలను, రాజకీయాలను పక్కనపెట్టాలని ప్రతిపక్ష నేతలను మంత్రి శ్రీధర్ బాబు కోరారు. 

Tags:    

Similar News