Collector Hanumantha Rao : బాయ్స్ వెల్ఫేర్ హాస్టల్‌లో రాత్రి బసచేసిన కలెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు సంస్థాన్ నారాయణపురంలోని ఎస్సీ బాయ్స్ గురుకుల హాస్టల్‌లో రాత్రి బస చేశారు. విద్యర్థులకు అందిస్తున్న ఫుడ్ మెనూ, వంటశాలను పరిశీలించారు. విద్యాభోదనపై విద్యార్థులను అడిగితెలుసుకున్నారు. అధికారులు నెలకు ఒకసారి హాస్టల్ రెసిడెన్షియల్ పాఠశాలను విజిట్ చేయాలని సూచించారు. తనిఖీలు చేయడం వల్ల పిల్లలకు మనోధైర్యం పెరుగుతుందని.. సౌకర్యాలు కల్పించడంలో సిబ్బంది నిర్లక్ష్యాన్ని తగ్గించొచ్చు అన్నారు కలెక్టర్ హనుమంత రావు.